తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్' వ్యాల్యూతో ఊరట.. తగ్గుతున్న కరోనా కేసులు! - కరోనా ఆర్ ఫ్యాక్టర్

కరోనా వ్యాప్తిని సూచించే ఆర్​ ఫ్యాక్టర్ (r factor Covid) దేశంలో క్రమంగా క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెల మధ్య నాటికి ఈ ఆర్ వ్యాల్యూ (r value Covid) 0.92కు తగ్గింది. మరోవైపు, కేరళలో (Kerala covid cases) 15 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

r value
క్షీణిస్తున్న ఆర్ వ్యాల్యూ.. తగ్గుతున్న కరోనా కేసులు!

By

Published : Sep 21, 2021, 10:41 PM IST

ఆగస్టులో ఒకటి కంటే ఎక్కువగా ఉండి కలవరపెట్టిన ఆర్ ఫ్యాక్టర్‌ (r factor Covid).. దేశంలో క్రమంగా క్షీణిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెల మధ్య నాటికి ఈ ఆర్ వ్యాల్యూ 0.92కు తగ్గినట్లు చెన్నై ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన ఓ బృందం గుర్తించింది. (R factor of corona in india)

కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుందనే దానిపై ఆర్‌ వ్యాల్యూ (r value Covid) ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందితే ఆ విలువ ఒకటిగా పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కేరళ, మహారాష్ట్రలోనూ... ఈ ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కంటే తక్కువగా ఉండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది. అయితే ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులో మాత్రం ఈ విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉండటం... కాస్త ఆందోళన కలిగిస్తోంది.

కేరళ కేసులు...

కాగా, కేరళలో కొత్తగా 15,768 కొత్త కేసులు (Kerala covid cases) బయటపడ్డాయి. మరో 214 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 21,367 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

  • మహారాష్ట్రలో 3,131 కేసులు వెలుగులోకి వచ్చాయి. (Covid cases in Maharashtra) 70 మంది మరణించారు. 4021 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 40,712 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • దేశరాజధాని దిల్లీలో 39 కేసులు నమోదయ్యాయి. (Delhi Covid cases today) 24 గంటల వ్యవధిలో ఒక్కరు కూడా కరోనాతో మరణించలేదు.
  • కర్ణాటకలో 818, గుజరాత్​లో 14, మధ్యప్రదేశ్​లో 8 కొత్త కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సినేషన్ @82 కోట్లు

మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ (Vaccination in India) రికార్డు వేగంతో కొనసాగుతోంది. మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 82 కోట్లు దాటింది. మంగళవారం ఏడు గంటల నాటికి 68 లక్షలకు పైగా డోసులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:హైవేపై కండోమ్​ల కేసులో ట్విస్ట్- సొరంగంలోనే వ్యభిచారం

ABOUT THE AUTHOR

...view details