గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన హింస కేసులో జమ్ముకశ్మీర్ యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ ఛైర్మన్ మోహిందర్ సింగ్, మన్దీప్ సింగ్ అనే యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
జమ్ము నగరానికి చెందిన మోహిందర్, గోల్ గుజ్రాల్‌కు చెందిన మన్దీప్ సింగ్ ఈ కేసులో కీలక నిందితులని పోలీసులు తెలిపారు. వీరిని దిల్లీ పోలీసు నేరవిభాగం కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ పోలీసుల సాయంతో వీరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.