తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల ట్రాక్టర్ పరేడ్​కు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవం వేళ దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. మూడు మార్గాల్లో 2 లక్షలకుపైగా ట్రాక్టర్లలో రైతులు నేడు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

R-Day Tractor Rally: Route, security arrangement, advisory
ట్రాక్టర్ ర్యాలీకి సర్వం సిద్ధం- పటిష్ఠ భద్రత

By

Published : Jan 26, 2021, 5:19 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతన్నలు ట్రాక్టర్ పరేడ్​కు సిద్ధమయ్యారు. దిల్లీ సరిహద్దులోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. 2లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతులు నిరసన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్​ మ్యాప్​ను సిద్ధం చేసుకున్నారు. శాంతియుతంగానే ర్యాలీ చేపట్టాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. యువత సంయమనంతో ఉండాలని సూచించారు.

మూడు రూట్లలో ర్యాలీకి అనుమతులు ఉన్నాయని పోలీసుల తెలిపారు. సింఘు, టిక్రి, గాజిపుర్ నుంచి ట్రాక్టర్ పరేడ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. నిరసనకారులు నియమించిన వలంటీర్లతో కలిసి ర్యాలీని క్రమబద్ధీకరించనున్నారు. మరోవైపు, రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

ర్యాలీ జరిగే మార్గాలివే

గాజిపుర్ మార్గం
సింఘు సరిహద్దు మార్గం
టిక్రి మార్గం

మహిళలు సైతం

ర్యాలీలో మహిళలు సైతం పాల్గొననున్నారు. కనీసం 500 మంది మహిళలు పరేడ్​కు హాజరవుతారని సామాజిక కార్యకర్త జెబా ఖాన్ తెలిపారు. ట్రాక్టర్లను నడిపేందుకు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details