తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైనిక సత్తా చాటిన గణతంత్ర ప్రదర్శన - national war memorial

భారత 72వ గణతంత్ర వేడుకలు అబ్బురపరిచాయి. దేశ సైనిక సామర్థ్యాన్ని, శక్తిని ప్రతిబింబించేలా సాగిన పరేడ్​ ఆకట్టుకుంది. అత్యాధునిక టీ-90 యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్​, పినాకా క్షిపణి వ్యవస్థల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

R-Day Parade: T- 90 Bhishma, Indian goes past saluting dais
సైనిక సామర్థ్యాన్ని చాటేలా ఆయుధ ప్రదర్శన

By

Published : Jan 26, 2021, 11:22 AM IST

భారత గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి. త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన అబ్బురపరిచింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటేలా ఆయుధ సంపత్తిని సగర్వంగా ప్రదర్శించింది భారత్​.

పదాతి దళం, నావికా దళం, వాయుసేన వరుసగా కవాతు నిర్వహించాయి.

పినాక మల్టీ బ్యారెల్​ రాకెట్​ లాంఛర్(ఎంబీఆర్​ఎల్​)​, బ్రహ్మోస్​ క్షిపణులు పరేడ్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్​ క్షిపణి

214 ఎంఎం పినాకా ఎంబీఆర్​ఎల్​ ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్​ వ్యవస్థల్లో ఒకటి. ఇది.. లక్ష్యాలను అతి తక్కువ కాలవ్యవధిలోనే ఛేదించగలదు.

పినాకా రాకెట్​ లాంచర్లు
కెప్టెన్​ గులాటి నేతృత్వంలో పినాకా క్షిపణుల పరేడ్​

బ్రహ్మోస్​ క్షిపణి ప్రదర్శనకు కెప్టెన్​ కమ్రుల్​ జమాన్​ నేతృత్వం వహించారు.

కెప్టెన్​ కమ్రుల్​ జమాన్​ నేతృత్వంలో బ్రహ్మోస్​ క్షిపణులు

ఈ బ్రహ్మోస్​ క్షిపణులను భారత్​-రష్యా సంయుక్తంగా రూపొందించాయి. ఇది గరిష్ఠంగా 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

భారత ప్రధాన యుద్ధ ట్యాంకుల్లో ఒకటైన టీ-90 భీష్మ, పరేడ్​కు కెప్టెన్​ కరణ్​వీర్​ సింగ్​ నేతృత్వం వహించారు. టీ-72 బ్రిడ్జ్​ లేయర్​ ట్యాంక్​, బీఎంపీ-2 ఆర్మోర్డ్​ పర్సనల్​ క్యారియర్​లు ఆకట్టుకున్నాయి.

T-90 భీష్మ యుద్ధట్యాంకుల ప్రదర్శన
కెప్టెన్​ కరణ్​వీర్​ సింగ్​

ప్రీతి చౌదరి నేతృత్వంలో..

140 ఎయిర్​ డిఫెన్స్​ రెజిమెంట్​ కెప్టెన్​ ప్రీతి చౌదరి షిల్కా వెపన్​ సిస్టమ్​కు నాయకత్వం వహించారు. గణతంత్ర వేడుకల్లో పదాతి దళం నుంచి పాల్గొన్న ఏకైక మహిళా కమాండర్​గా నిలిచారు.

షిల్కా క్షిపణి వ్యవస్థ పరేడ్​
కెప్టెన్​ ప్రీతి చౌదరి

షిల్కా వెపన్​ సిస్టమ్​.. అత్యాధునిక రాడార్​, డిజిటల్​ ఫైర్​ కంట్రోల్​ కంప్యూటర్స్​ కలయికతో తయారైంది.

దేశంలోని తొలి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ యుద్ధ విమానాల సైనిక విన్యాసాల్లో పాల్గొన్నారు.

మహిళా పైలట్​ భావనా కాంత్​

స్వర్ణిమ్​ విజయ్​ వర్ష్​ ఇతివృత్తంతో..

స్వర్ణిమ్​ విజయ్​ వర్ష్​ ఇతివృత్తంతో నావికా దళం

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో స్వర్ణిమ్ విజయ్ వర్ష్‌ థీమ్‌తో నావికాదళం పాల్గొంది. బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో సేవలందించిన ఐఎన్‌ఎస్‌-విక్రాంత్‌ విమాన వాహక నౌకను నావికాదళం ప్రదర్శించింది.

నావికా దళం పరేడ్​

ABOUT THE AUTHOR

...view details