తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గణతంత్ర వేడుకల వేళ.. పేలుళ్ల కలకలం

R-Day 2022: రిపబ్లిక్​ డే వేడుకల వేళ.. శ్రీనగర్​లో పేలుళ్లు కలకలం సృష్టించాయి. భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్రనేడ్ దాడి చేశారు ముష్కరులు. అయితే.. ఈ దాడి వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

security
భద్రతా సిబ్బంది

By

Published : Jan 26, 2022, 12:25 AM IST

Updated : Jan 26, 2022, 6:52 AM IST

R-Day 2022: గణతంత్ర వేడుకలకు ఒక్కరోజు ముందే భద్రతా సిబ్బందిపై గ్రనేడ్​తో దాడి చేశారు ముష్కరులు. శ్రీనగర్​లో హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఓ సైనికాధికారి వెల్లడించారు.

మంగళవారం 3. 30 గంటలకు భద్రతా సిబ్బందిపై ముష్కరులు గ్రనేడ్​ విరిసినట్లు తెలిసింది. అయితే.. గ్రనేడ్​ రోడ్​పైనే పేలిపోయిన కారణంగా భద్రతా సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపడుతున్నారు అధికారులు.

కిష్త్వాడ్​లో పేలుడు పదార్థాలు..

జమ్ముకశ్మీర్​ కిష్త్వాడ్ జిల్లాలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. 1.3 కేజీల పేలుడు పదార్థాలు ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్నాయి.

దిల్లీలో భద్రత కట్టుదిట్టం

గణతంత్ర వేడుకల దృష్ట్యా దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు డీసీపీ శ్వేత చౌహాన్ తెలిపారు. పరేడ్​ ప్రాంతంలో అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.

దిల్లీలో తనిఖీలు

ఇదీ చదవండి:

Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..

భారత తొలి సీడీఎస్​ రావత్​కు మరణానంతరం పద్మవిభూషణ్​

Last Updated : Jan 26, 2022, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details