తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డ్రై స్వాబ్​ టెస్ట్​'తో 3గంటల్లోనే కచ్చితమైన ఫలితం! - నేషనల్​ ఎన్విరాన్​మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​

కొవిడ్​ నిర్ధరణ కోసం కచ్చితమైన ఫలితాలనిచ్చే కొత్తరకం పరీక్షను అందుబాటులోకి తీసుకొచ్చారు మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్తలు. కేవలం మూడు గంటల్లోనే ఫలితాలనిచ్చే 'డ్రై స్వాబ్​ టెస్ట్​' ప్రస్తుతం.. నేషనల్​ ఎన్విరాన్​మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ విధానాన్ని మరిన్ని ప్రయోగశాలలకు విస్తరిస్తామన్నారు పరిశోధకులు.

NEERI, National Environment Engineering Research Program
నేషనల్​ ఎన్విరాన్​మెంట్​ ఇంజినీరింగ్​ రీసర్చ్​ ప్రోగ్రామ్

By

Published : May 7, 2021, 12:26 PM IST

కరోనా నిర్ధరణ పరీక్షల కోసం చేసే ఆర్​టీపీసీఆర్​ టెస్టింగ్​లో ఫలితాల కోసం సుమారు 48 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు ఆర్​టీపీసీఆర్​ కంటే వేగంగా, కచ్చితమైన ఫలితాలనిచ్చే 'డ్రై స్వాబ్​ టెస్ట్​'ను అందుబాటులోకి తెచ్చారు మహారాష్ట్ర నాగ్​పుర్​లోని 'నేషనల్​ ఎన్విరాన్​మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​(నీరి)' పరిశోధకులు. ఈ పరీక్షల్లో కేవలం 3 గంటల్లోనే కచ్చితమైన ఫలితాలు వెలువడుతాయని చెబుతున్నారు.

54వేల పరీక్షలు విజయవంతం..

నాగ్​పుర్​లో ఇటీవల.. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ​అందువల్ల పరీక్షల సంఖ్యా పెంచాల్సి వచ్చింది. అయితే.. ఆర్​టీపీసీఆర్​లో ఫలితాలు ఆలస్యమవుతున్నందున.. వైరస్​ కేసులు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విస్తృత పరిశోధనలు చేశారు 'నీరి' శాస్త్రవేత్తలు. 'డ్రై స్వాబ్​ పరీక్ష'ల్లో ఇప్పటివరకు 54వేల టెస్టింగ్​లను విజయవంతంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణకు ఖర్చుకూడా తక్కువగానే ఉంటుందన్నారు.

ఆర్​టీపీసీఆర్​ తరహాలోనే..

ఆర్​టీపీసీఆర్​ తరహాలోనే డ్రై స్వాబ్​ టెస్టింగ్​లోనూ నమూనాను తీసుకుంటారు. దాన్ని 4 డిగ్రీ సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రత వద్ద ఉంచి పరీక్షిస్తారు. ఈ ట్యూబ్​ ద్వారా కొవిడ్​ సంకోచించే అవకాశం దాదాపుగా ఉండదని పరిశోధకులు అన్నారు. ఈ పద్ధతి ప్రస్తుతం.. 'నీరి' ప్రయోగశాలలో మాత్రమే ఉపయోగిస్తున్నామని.. త్వరలోనే 40 పరిశోధనా కేంద్రాలకు చెందిన ప్రయోగశాల నిపుణులకు విస్తరిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:కరోనా రోగిని తరలించినందుకు రూ.1.2లక్షలు డిమాండ్​!

ABOUT THE AUTHOR

...view details