మాదకద్రవ్యాల మత్తులో ఉన్న ముగ్గురు యువకులు నడిరోడ్డుపైన వీరంగం సృష్టించారు. ఒకరిపై మరొకరు రాళ్లురువ్వుకున్నారు. పోలీసుల ముందే జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఓ పబ్లిక్ పార్కు వద్ద శనివారం ఈ ఘటన జరిగింది.
మాదకద్రవ్యాల మత్తులో యువకుల వీరంగం - మాదకద్రవ్యాలు మధ్యప్రదేశ్
డ్రగ్స్ మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఘర్షణకు దిగారు. పబ్లిక్ పార్కు వద్ద పరస్పరం రాళ్లురువ్వుకొని వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
![మాదకద్రవ్యాల మత్తులో యువకుల వీరంగం madhya pradesh drug addict news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12494411-thumbnail-3x2-mp.jpg)
మాదకద్రవ్యాల మత్తులో యువకుల వీరంగం
మాదకద్రవ్యాల మత్తులో యువకుల వీరంగం
ఈ ఘర్షణను అదుపు చేసేందుకు అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు ప్రయత్నించినా వారు ఆగలేదు. ఎట్టకేలకు కొంత సమయం తర్వాత మరికొంత మంది సిబ్బంది సాయంతో వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. యువకుల మధ్య ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి :భార్య హంతకుడి తలకు రైతు రివార్డు!