తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్​డీవో - ఐటీఆర్

'క్విక్​ రియాక్షన్ సర్ఫేస్​ టు ఎయిర్' (క్యూఆర్ఎస్ఏఎం)క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీవో. ఒడిశాలోని ఛాంద్​పూర్​ టెస్ట్ రేంజ్​లో ఈ పరీక్ష నిర్వహించింది.

QRSAM_DRDO
మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్​డీవో

By

Published : Nov 13, 2020, 8:59 PM IST

భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఛాంద్​పూర్​ ఇంటిగ్రేటెడ్​ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) కేంద్రంలో 'క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి' పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

స్వదేశీ పరిజ్ఞానంతోనే...

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అన్ని రకాల వస్తువులను క్విక్​ రియాక్షన్ క్షిపణి తయారీకి ఉపయోగించినట్లు డీఆర్​డీవో పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ క్షిపణి ప్రయోగం జరిపినట్లు వెల్లడించింది.

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి ద్వారా నిర్ణీత దూరం, సమయంలో... బాన్షి పైలట్​ రహిత టార్గెట్​ను పేల్చినట్లు డీఆర్​డీఓ తెలిపింది. క్షిపణిలో.. బ్యాటరీ, మల్టిఫంక్షనింగ్ రాడార్, బ్యాటరీ సర్వైలెన్స్ రాడార్, మొబైల్​ లాంఛర్​ మొదలైన అన్ని సాధనాలను అమర్చినట్లు పేర్కొంది.

ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ డీఆర్​డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.

ఇదీ చదవండి:పాకిస్థాన్​ కాల్పులు- ఎస్సై సహా ముగ్గురు జవాన్లు వీరమరణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details