Free fire player Qatar kidnap: ఆన్లైన్ గేమ్‌లో పరిచయమైన ఓ బాలికను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖతర్ నుంచి వచ్చిన నిందితుడు 13 ఏళ్ల బాలికను మభ్యపెట్టి నేపాల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, మధ్యలోనే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. నిందితుడికి(25) బాలికకు ఫ్రీ ఫైర్ గేమ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులుగా మారారు. రాజస్థాన్‌లోని దౌసాలో నివసించే బాలికను చూసేందుకు ఖతర్ నుంచి వచ్చాడు ఆ వ్యక్తి. జూన్ 18న బాలికను బ్లాక్మెయిల్ చేసి రైల్వే స్టేషన్‌కు రావాలని డిమాండ్ చేశాడు. అనంతరం, నేపాల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈలోగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని వెంబడించారు. చివరకు బిహార్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
'ఫ్రీ ఫైర్'లో బాలికతో పరిచయం.. ఖతర్ నుంచి వచ్చి కిడ్నాప్.. నేపాల్‌కు తీసుకెళ్తుండగా.. - నేపాల్‌కు కిడ్నాప్ బాలిక ఖతర్ కిడ్నాప్
Qatar man kidnaps minor: ఆన్లైన్ గేమ్‌లో బాలికతో పరిచయం పెంచుకున్న ఓ ఖతర్ వాసి.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. బాలికను బ్లాక్మెయిల్ చేసి అపహరించుకుపోయాడు. నేపాల్‌కు వెళ్లేందుకు ప్లాన్ వేసుకోగా.. మధ్యలోనే పోలీసులు వారిని అడ్డగించారు.
'ఆరు రోజుల క్రితం మైనర్ తల్లిదండ్రులు బాందికుయీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ సహాయంతో సమాచారం అందుకొని విచారణ చేపట్టాం. బాలిక ఫ్రీ ఫైర్ గేమ్ అడుతుండేదని తెలిసింది. నిందితుడిని నదాఫ్ మన్సూరీగా గుర్తించాం. అదే గేమ్ ద్వారా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. జూన్ 18న ఖతర్ నుంచి దిల్లీకి వచ్చి.. అక్కడి నుంచి రైలులో బాందికుయీకి చేరుకున్నాడు. అదేరోజు రాత్రి బాలికను బ్లాక్మెయిల్ చేసి రైల్వే స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. మభ్యపెట్టి నేపాల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. దిల్లీలో అతడు ఫేక్ ఐడీ ద్వారా ఓ సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ ఫోన్ లొకేషన్ బిహార్‌లో కనిపించింది. పోలీసుల బృందం అక్కడికి వెళ్లి దర్భంగ స్టేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అతడిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నాం' అని దౌసా ఎస్పీ రాజ్‌కుమార్ గుప్తా తెలిపారు.
ఇదీ చదవండి: