తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖతార్​లో నేవీ అధికారులకు మరణశిక్షపై అప్పీల్​- వారిని కలిసేందుకు మరో ఛాన్స్

Qatar Indian Naval Officers : గూడఛార ఆరోపణలతో భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్‌ కోర్టు విధించిన మరణశిక్ష సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న అధికారులను కలిసేందుకు ఖతార్‌ నుంచి భారత రాయబార కార్యాలయానికి మరో అనుమతి లభించిందని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు.

Qatar Indian Naval Officers
Qatar Indian Naval Officers

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 7:24 AM IST

Updated : Nov 10, 2023, 9:36 AM IST

Qatar Indian Naval Officers :ఖతార్​లో 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని... తీర్పు గోప్యత దృష్ట్యా కేవలం న్యాయ బృందంతోనే పంచుకునే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. నిర్బంధంలో ఉన్న అధికారులను కలిసేందుకు ఖతార్‌ నుంచి భారత రాయబార కార్యాలయానికి మరో అనుమతి లభించిందని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. నౌకాదళ మాజీ అధికారులకు న్యాయపరంగా, దౌత్యపరంగా పూర్తి సహకారాన్ని అందజేస్తామన్నారు.

అసలేం జరిగిందంటే..?
Indian Navy Officers Detained In Qatar :భారత్‌కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్​లోని అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతార్‌ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలిసింది. అయితే, వీరందరికి భారత అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు బాధితులతో పాటు ఖతార్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లగా.. గతనెల చివరి వారంలో ఎనిమిది మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది ఖతార్​ న్యాయస్థానం.

దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది. నేవీ మాజీ అధికారుల కుటుంబసభ్యులతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. మాజీ నేవీ అధికారులకు అన్నిరకాలుగా దౌత్యపరమైన, న్యాయపరమైన సాయం కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని వివరించింది. వీరినివిడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. బాధిత అధికారుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Qatar Indian Navy Officers : 'ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం!'.. బాధిత కుటుంబాలకు జైశంకర్ పరామర్శ

Qatar Navy Case : భారత నేవీ మాజీ అధికారులకు మరణశిక్ష.. ఖతార్ కోర్టు సంచలన తీర్పు

Last Updated : Nov 10, 2023, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details