తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆసుపత్రికి భోపాల్​ అత్యాచార బాధితులు - Madhya Pradesh Police

భోపాల్​లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉన్న అత్యాచార బాలికలను ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ బాధితురాలు మరణించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) విచారణ కొనసాగుతోంది.

Pyare Miya case: Three minor rape survivors admitted to hospital
ఆసుపత్రికి భోపాల్​ అత్యాచార బాధితులు

By

Published : Jan 25, 2021, 3:56 PM IST

మధ్యప్రదేశ్​ భోపాల్​లో సంచలనం సృష్టించిన ఐదుగురు మైనర్​ బాలికల అత్యాచార కేసులో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉన్న ముగ్గురు అత్యాచార బాధితులను ఆదివారం ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇటీవల ఓ బాధితురాలు మరణించగా దానిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) విచారణ కొనసాగుతోంది.

ఈ క్రమంలో సంరక్షణ కేంద్రానికి చేరుకున్న అధికారులు.. నీరసంగా ఉన్న బాలికలను గుర్తించారు. వాంతులు, ​కడుపునొప్పి, తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న బాధితులను.. వెంటనే అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని జైప్రకాశ్ జిల్లా ఆసుపత్రిలో, మరొకరిని హమిదియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

'అందుకే ఒత్తిడికి గురవుతున్నారు'

తమ పిల్లలకు సంబంధించి ఎలాంటి సమాచారం అధికారులు అందించలేదని.. వారిని కలుసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. అందువల్లే వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. తమ పిల్లలను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు.. మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

భోపాల్​లో అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల్లో ఒకరైన మైనర్(17).. నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలికకు బలవంతంగా అంత్యక్రియలుచేశారు పోలీసులు. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఐదుగురు మైనర్ల అత్యాచార కేసును దర్యాప్తు చేయడానికి మధ్యప్రదేశ్​ ప్రభుత్వం సిట్​ బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిపై పలుమార్లు రేప్ చేసినందుకు గానూ నిందితుడు ప్యారే మియాన్​.. అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఇదీ చూడండి:మనీలాండరింగ్​ కేసులో ఇద్దరు చైనీయులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details