తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తగ్గేదేలే'.. పుష్ప డైలాగ్​తో కొవిడ్​పై కేంద్రం అవగాహన - పుష్ప మాస్కు సమాచార శాఖ మీమ్

Pushpa mask meme: కరోనాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్​ను ఉపయోగించింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. 'డెల్టా అయినా, ఒమిక్రాన్ అయినా నేను మాస్కు తీసేదే లే' అని పేర్కొంటూ మీమ్​ను రూపొందించింది.

mask pushpa
mask pushpa

By

Published : Jan 20, 2022, 7:30 AM IST

Pushpa mask meme: 'పుష్ప.. పుష్పరాజ్‌ ఇక్కడ. తగ్గేదే లే' అంటూ 'పుష్ప' చిత్రంలో కథానాయకుడు అల్లు అర్జున్‌ తనదైన శైలిలో చెప్పే డైలాగు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది. పాన్‌ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాను అదే పేరుతో హిందీలో కూడా విడుదల చేశారు. 'పుష్ప, పుష్పరాజ్‌.. మై ఝుకూంగా నహీ' అంటూ ఇందులో ఉన్న పాపులర్‌ డైలాగును 'డెల్టా హో యా ఒమిక్రాన్‌.. మై మాస్క్‌ ఉతారేగా నహీ' (డెల్టా అయినా ఒమిక్రానైనా.. నేను మాస్కు తీసేదే లేదు) అంటూ మార్చిన ఓ సరదా మీమ్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ బుధవారం తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది.

Pushpa IB ministry

అల్లు అర్జున్‌ మాస్కు పెట్టుకొన్నట్టుగా ఉన్న ఈ మీమ్‌ను కొవిడ్‌-19పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, మాస్కులు పెట్టుకునేలా ప్రోత్సహించే ఉద్దేశంతో రూపొందించారు.

ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమా దక్షిణాదితో పాటు ఉత్తరాది ఆడియెన్స్​ను విపరీతంగా అలరిస్తోంది. శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్.. వన్​మ్యాన్ షో చేశారు.

ఇదీ చదవండి:శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం

ABOUT THE AUTHOR

...view details