Pushpa Fame Keshava alias Jagadish Case Registered : పుష్ప సినిమాలో సహనటుడుగా నటించిన కేశవ(మచ్చా) అలియాస్ జగదీశ్ ఆలీపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ యువతి చావుకు జగదీశ్ కారణమంటూ, మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాధిత యువతి షార్ట్ ఫిలిమ్స్ తీసేదని, ఈ క్రమంలో జగదీశ్ పరిచయమై, తన కూతురును మోసం చేశాడని ఫిర్యాదులో యువతి తండ్రి పేర్కొన్నారు. జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్ ఆర్టిస్ట్) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.