Pushpa dialogue in answer sheet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని డైలాగ్.. దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ డైలాగ్‌ను పలుకుతూ తమ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బంగాల్లోని ఓ పాఠశాల విద్యార్థి తన ఆన్సర్ షీట్లో ఇదే డైలాగ్ రాశాడు. 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని తన పదో తరగతి ఆన్సర్ షీట్లో రాసి పెట్టాడు. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడు దీన్ని చూసి షాక్ అయ్యారు. ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. దీంతో ఈ చిత్రం వైరల్ అవుతోంది.
'జవాబులు రాసేదే లే'.. పదో తరగతి ఆన్సర్ షీట్లో పుష్పరాజ్! - 10 th class answer sheet pushpa
Pushpa dialogue in answer sheet: 'పుష్ప... పుష్పరాజ్'... తెలుగు సినీ అభిమానులనే కాదు.. హిందీ ప్రేక్షకులను సైతం కట్టిపడేసిన పాపులర్ డైలాగ్ ఇది. ఎంతో మంది క్రికెటర్లు, సెలబ్రిటీలు ఈ డైలాగ్‌ను అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేశారు. ఈ డైలాగ్‌ను ఉపయోగిస్తూ ఎన్నో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి.. ఏకంగా తన ఆన్సర్ షీట్లోనే సినిమా డైలాగ్‌ను రాశాడు.
బంగాల్లోని సెకండరీ స్కూల్ పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. జవాబుల మూల్యాంకనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఈ ఆన్సర్ షీట్ బయటపడింది. అందులో విద్యార్థి ఇంకేం రాయలేదని తెలుస్తోంది. ఆ విద్యార్థికి అసలు పరీక్ష రాసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. 'ఖేలా హోబె' డైలాగులనూ కొంతమంది విద్యార్థులు రాశారని చెప్పారు. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఈ నినాదం ఇచ్చి.. భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
ఇదీ చదవండి:'ఎలక్ట్రిక్ వాహనాలపై తిరగండి'.. పెట్రోల్ ధరలపై ప్రశ్నిస్తే మంత్రి సలహా