Puri Jagannath temple open: కొవిడ్ వల్ల మూతపడిన ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయం ఫిబ్రవరి 1న తెరుచుకోనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. శానిటైజేషన్ చేసేందుకు ఆదివారాలు మూసి వేయనున్నట్లు పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ్ వర్మ తెలిపారు.
శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం(ఎస్జేటీఏ), ఆలయ సేవలకుల సంఘంతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు కలెక్టర్.
" స్థానికుల ఆదాయం ఎక్కువగా ఆలయంపైనే ఆధారపడి ఉంది. దీంతోపాటు ప్రజల సెంటిమెంట్లు, కరోనా తగ్గుముఖం పట్టటాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1న పూరీ ఆలయాన్ని తిరిగి తెరవాలని నిర్ణయించాం. స్థానిక పరిస్థితుల మేరకు పండగల రోజుల్లో ఆలయం మూసి ఉంటుంది. తూర్పు ద్వారం(సింహ ద్వారం) ద్వారా మాత్రామే భక్తులను అనుమతిస్తారు."
- సమర్థ్ వర్మ, పూరీ జిల్లా కలెక్టర్