Punjabi singer Sidhu Moosewala shot dead: పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తుండగా ఆయన బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. సిద్ధూ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయన మరణవార్త విని షాకైనట్లు ట్వీట్ చేశారు. సిద్ధూ ఆత్మీయులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సిద్ధూ మృతి పెట్ల కాంగ్రెస్ సహా పలు పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగర్ మృతి పట్ల స్పందించిన సీఎం భగవంత్ మాన్.. బాధ్యుల్ని విడిచిబెట్టబోమని అన్నారు. బాధిత కుటుంబానికి, సిద్ధూ అభిమానులకు సానుభూతి తెలిపారు.
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య - సిద్ధూ మృతి
18:43 May 29
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య
గతేడాది డిసెంబర్లో సిద్ధూ.. కాంగ్రెస్లో చేరారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు.. ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా గతంలో ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తేరీ మేరీ జోడీ', మోసా జఠ్.. వంటి చిత్రాల్లోనూ నటించారు. 2020 జులై కొవిడ్ లాక్‌డౌన్ విధించినప్పుడు ఫైరింగ్ రేంజ్‌లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదు నమోదైంది.
ఇవీ చూడండి:మరో విద్యుత్ సంక్షోభం దిశగా భారత్.. జులై- ఆగస్టులో చుక్కలే!
వెకేషన్కు వెళ్లి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. వందల అడుగుల లోతులో..