Punjab Terror Attack: గణతంత్ర వేడుకలకు ముందు పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. శుక్రవారం భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. గుర్దాస్పుర్లో.. ఓ గ్రెనేడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఉగ్రఅనుచరుడిగా వ్యవహరిస్తున్నాడన్న కారణంగా గజికోట్కు చెందిన మల్కీత్ సింగ్‌ను గురుదాస్‌పుర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసిన నేపథ్యంలో కొందరు ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించినట్లు తెలిసిందని బార్డర్ రేంజ్ ఐజీపీ మోహినిష్ చావ్లా తెలిపారు. ఈ క్రమంలో తనిఖీ నిర్వహించి భారీ మొత్తం పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ సిక్ యూత్ ఫెడరేషన్ ఛీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ నుంచి ఈ పేలుడు పదార్థాలు భారత్‌కు చేరి ఉంటాయని అన్నారు.
గతేడాది నవంబర్- డిసెంబర్‌లోను గుర్దాస్పుర్ పోలీసులు రెండు ఉగ్రకుట్రలను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్లాన్‌ను భగ్నం చేసి నలుగురిని అరెస్టు చేశారు. కేజీ ఆర్డీఎక్స్, 6 చేతి గ్రెనేడ్లు, టిఫిన్ బాక్స్ ఐఈడీ, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, రెండు పిస్టోల్స్ స్వాధీనం చేసుకున్నారు.