తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో సీబీఐకి ఇక నో ఎంట్రీ

పంజాబ్​లోని కాంగ్రెస్​ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇకపై రాష్ట్ర పరిధిలోని కేసుల విచారణ చేపట్టరాదని స్పష్టం చేసింది. ఇందుకుగాను సీబీఐకి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసింది.

Punjab revokes 'general consent' to CBI
పంజాబ్​లో సీబీఐకు ఇక నో ఎంట్రీ

By

Published : Nov 10, 2020, 1:40 PM IST

రాష్ట్ర పరిధిలోని కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టకుండా పంజాబ్​ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర​ ప్రభుత్వం అనుమతి లేకుండా నేర, నేర సంబంధిత కేసుల దర్యాప్తు చేపట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న భాజపాయేతర రాష్ట్రాల సరసన పంజాబ్ కూడా​ చేరింది.

పశ్చిమ్ బంగ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చే సాధారణ సమ్మితిని ఇప్పటికే ఉపసంహరించుకున్నాయి. పంజాబ్​ విడుదల చేసిన నోటిఫికేషన్​ ప్రకారం దిల్లీ పోలీసు చట్టాల ద్వారా రూపొందిన సీబీఐ ఇకపై ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొంది. గతం ఇలాంటి నిర్ణయం తీసుకున్నా.. వేరే కారణాలు వల్ల అనుమతి ఇవ్వడం తెలిసిందే.

ఇదీ చూడండి: నకిలీ టీఆర్​పీ కేసులో రిపబ్లిక్​ టీవీ ప్రతినిధి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details