తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం, ఒకేసారి 2700కిలోలు - punjab police raid

అమృత్​సర్​లో ఓ ఇంటి నుంచి 2,700 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ పోలీసులు. దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.

punjab rdx news
పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం, ఒకేసారి 2700కిలోలు

By

Published : Aug 17, 2022, 4:12 PM IST

Punjab RDX news : పంజాబ్‌లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్‌ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్​ఐ దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఉగ్రకుట్ర ఉన్నట్లు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్​ఐ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అమృత్‌సర్‌ పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

కొద్దిరోజుల క్రితం ఇదే తరహాలో భారీ స్థాయిలో ఆయుధాలు బయటపడడం కలకలం రేపింది. స్వాతంత్ర్య వేడుకలకు ముందు.. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను పంజాబ్-దిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు.

"స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను దిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం" అని ఆగస్టు 14న పంజాబ్‌ పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్‌లు సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details