తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్ర ఎన్నికల్లో రూ.404 కోట్ల విలువైన మద్యం స్వాధీనం! - valuables seized in punjab elections

Punjab Polls: పంజాబ్​లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసిన నాటి నుంచి రూ.404.01కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

Punjab Polls
పంజాబ్ ఎన్నికలు

By

Published : Feb 11, 2022, 4:47 AM IST

Updated : Feb 11, 2022, 6:16 AM IST

Punjab Polls: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిననాటి నుంచి పంజాబ్​లో ఇప్పటివరకు రూ.404.01కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

నిఘా బృందాలు రూ.25.79కోట్ల విలువైన 45.06 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రూ.315కోట్ల విలువైన సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. రూ.26.59 కోట్ల నగదును అధికారులు జప్తు చేశారు. 2,148 మంది వ్యక్తులను వివిధ కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం 3,90,170 లైసెన్స్​డ్​ ఆయుధాలలో ఇప్పటివరకు 3,79,133 ఆయుధాలు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్​లేని 118 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కాగా.. పంజాబ్​లో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 10న జరుగుతుంది.

ఇదీ చదవండి:యూపీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతం.. 57.79% పోలింగ్

Last Updated : Feb 11, 2022, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details