Punjab polls: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది పంజాబ్ కాంగ్రెస్. ఇందులో భాగంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం వర్చువల్‌గా భేటీ అయింది. 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని, త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. మరోమారు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తుది జాబితాను ఖరారు చేయనుందని, శుక్రవారమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు మరికొంత మంది నేతలు పేర్కొన్నారు.
సీఎం రెండు సీట్లలో పోటీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని రెండు స్థానాల్లో బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చమ్‌కౌర్ నియోజకవర్గంతో పాటు మరో స్థానంలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పాయి.
" మాఝా ప్రాంతంలోని చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానంతో పాటు దోవోబా ప్రాంతంలోని అదంపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం చన్నీని బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అలాగే.. సిట్టింగ్ ఎంపీలను సైతం అసెంబ్లీ బరిలో నిలిపినా ఆశ్చర్యమేమీ లేదు."