కరోనా చికిత్సలో కీలక ఔషధంగా భావిస్తున్న రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ.. కొందరు అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్న వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్లోని రోపార్ జిల్లా సాలెంపూర్ గ్రామ సమీపంలో ఉన్న భాక్రా కాలువలో పెద్దఎత్తున రెమ్‌డెవిసిర్ ఇంజక్షన్లు కొట్టుకొస్తున్న విషయాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే.. డీఎస్పీ సుఖ్జిందర్ సింగ్ అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు.. సీనియర్ వైద్యాధికారి(ఎస్ఎంఓ)ని సాలెంపూర్ గ్రామంలోని ఘటన స్థలానికి పంపారు. అయితే.. వీటిని పరీక్షించిన జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి నకిలీవిగా పేర్కొన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.