తెలంగాణ

telangana

ETV Bharat / bharat

53 ఏళ్ల సూపర్​ డాక్టర్​.. సైకిల్​పై 'లక్ష' కి.మీ సవారీ.. గిన్నిస్​ రికార్డే టార్గెట్​!

సైక్లింగ్​లో ఎవరూ సాధించని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నారు ఓ 53 ఏళ్ల డాక్టర్​. ఇప్పటివరకు సైకిల్​పై లక్ష కిలోమీటర్ల ప్రయాణం చేసిన ఆయన గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించడమే లక్ష్యంగా తన యాత్రను కొనసాగిస్తున్నారు​. నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న ఆ సూపర్​ డాక్టర్​ గురించి తెలుసుకుందా రండి.

DR PAWAN DHINGRA WON MANY MEDALS IN CYCLING NOW PREPARING TO MAKE WORLD RECORD
లక్ష కి.మీలు సైకిల్​ తొక్కిన 53 ఏళ్ల డాక్టర్​.. గిన్నిస్​ రికార్డే లక్ష్యంగా..

By

Published : May 26, 2023, 6:31 PM IST

సైక్లింగ్​లో ఇదివరకే లక్ష కిలోమీటర్లు ఆయన ప్రయాణించారు. అంతటితో ఆగకుండా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించడమే లక్ష్యంగా మరింత కృషి చేస్తూ దూసుకుపోతున్నారు పంజాబ్​కు​ చెందిన 53 ఏళ్ల డాక్టర్​ పవన్​ ధింగ్రా. పని ఒత్తిడి, బద్ధకం ఇతరత్రా కారణాలను సాకుగా చూపి వ్యాయామం, యోగా వంటి వాటికి దూరంగా ఉంటున్న నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇప్పటివరకు 153 ఈవెంట్లలో పాల్గొన్న పవన్​ ధింగ్రా 66,600 కిలోమీటర్ల సైక్లింగ్​ను పూర్తి చేశారు. ఈవెంట్లలో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగానూ ఇప్పటివరకు దేశమంతటా కలిపి సుమారు లక్ష కిలోమీటర్ల దూరం వరకు సైకిల్​ను తొక్కారు. ఇటీవలే ఆయన ఈ ఘనతను సాధించారు. దీంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నారు.

సైక్లిస్ట్​ డాక్టర్​ పవన్​ ధింగ్రా

సైక్లింగ్​తో సంచలనాలు!
లుథియానాకు చెందిన డాక్టర్ పవన్​ ధింగ్రా గత 6 సంవత్సరాలుగా సైకిల్ తొక్కుతున్నారు. దీనినే ఒక హాబీగా మార్చుకున్నారు. 2017లో సైకిల్ తొక్కడం ప్రారంభించిన ఆయన సైక్లింగ్​లో పలు మైలురాయిలను దాటుకుంటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 3 సార్లు తన పేరును నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడమే లక్ష్యంగా మరింత కష్టపడుతున్నారు. ఇందుకు కావాల్సిన అర్హత.. 200 ఈవెంట్​లలో కలిపి మొత్తం లక్ష కిలోమీటర్ల వరకు సైక్లింగ్​ చేయడం. ప్రస్తుతం ఈ ఫీట్​ను అందుకునేందుకు కృషి చేస్తున్నారు.

కుటుంబం మొత్తం వైద్యరంగంలోనే..
డాక్టర్ పవన్​ ధింగ్రా MBBS, MS (ఆర్థోపెడిక్స్) పూర్తి చేశారు. ఈయన ప్రస్తుతం లుథియానాలోని దేవ్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జన్​గా సేవలందిస్తున్నారు. ఈయన భార్య డాక్టర్ రీతు ఇదే ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ లుథియానాలోనే ఎంబీబీఎస్‌ చదువుతున్నారు.

సైక్లిస్ట్​ డాక్టర్​ పవన్​ ధింగ్రా

153 ఈవెంట్లు.. 66 వేలకిపైగా కి.మీ!
2023 మార్చి వరకు 153 పోటీల్లో పాల్గొన్న పవన్​ ధింగ్రా మొత్తం 66,600 కి.మీల మేర సైకిల్​పై ప్రయాణం చేశారు. 1000 కి.మీ (దిల్లీ-వాహ్గా-దిల్లీ), 1200 కి.మీ (నోయిడా-జమ్మూ-నోయిడా), 1200 కి.మీ (జలంధర్-జమ్మూ-సురత్‌ఘర్-జలంధర్), 1400 కి.మీ (దిల్లీ-నేపాల్-దిల్లీ), 1200 కి.మీ (పారిస్​ బ్రెస్ట్​ ప్యారిస్), 1200 కి.మీ (దిల్లీ-కల్కా-ఉనా-మెక్‌లియోడ్‌గంజ్-బజ్​నాథ్-ధర్మశాల-దిల్లీ). వీటితో పాటు 6 రోజులు, 5 రాత్రులు కలిపి సుమారు 1460 కి.మీ.లు (ఇండియా గేట్-గేట్‌వే ఆఫ్ ఇండియా) ప్రయాణించారు. ఇలా రాత్రింబవళ్లు తేడాల్లేకుండా దిల్లీ వంతెన, హౌరా వంతెనల మీదుగా 1480 కి.మీలు సైకిల్​ తొక్కారు. వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్​ సర్టిఫైడ్ మల్టీ-డే స్టేజ్డ్ రేస్ ఫార్మాట్‌లో ఇటీవల 14 రోజులు, 13 రాత్రులు కలుపుకొని (శ్రీనగర్ నుంచి కన్యాకుమారి) వరకు 3650 కి.మీల ప్రయాణాన్ని పూర్తి చేశారు.

మంచి ఆరోగ్యానికి సైక్లింగ్​!
పవన్‌కు 47 ఏళ్ల వయసులో కంటి నుంచి రక్తం కారింది. దీంతో ఆయన కచ్చితంగా సైకిల్​ తొక్కాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో తన శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అలా మొదలైన్ డాక్టర్​ పవన్​ సైక్లింగ్​ యాత్ర గత 6 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగుతోంది.

డాక్టర్​ పవన్​ ధింగ్రా సాధించిన పతకాలు

ఈ క్రమంలో ఆయన పదుల సంఖ్యలో పతకాలను సొంతం చేసుకున్నారు. ఇకపై తన దృష్టంతా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించడం పైనే పెడతానని చెబుతున్నారు. అందుకు కావాల్సిన అర్హతలను సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వైద్యుడిగా పవన్​ 5 రోజులు సేవలందిస్తారు. శని, ఆదివారాలను సైక్లింగ్​ ప్రాక్టీస్​కు కేటాయిస్తారు.

"సైక్లింగ్​తో అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. నేటి యువత కూడా సైక్లింగ్​, వ్యాయామం, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టాలి. అందుకు తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. వీటితోనే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలం"

- డాక్టర్​. పవన్​ ధింగ్రా, సైక్లిస్ట్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details