ఓ వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లోహ్రీ లక్కీ డ్రాలో రూ. 5 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతడి కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో జరిగింది.
మహంత్ ద్వారకా దాస్ అనే వృద్ధుడు త్రివేది క్యాంప్ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. అతడి కుమారుడు నరేంద్ర కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాటరీ పట్ల హమంత్కు ఆసక్తి ఉన్న కారణంగా తరచూ టికెట్లు కొనేవాడు. అలా కొన్ని రోజుల క్రితం మహంత్ దాస్ మనవడు నిఖిల్ శర్మతో జాకీర్పుర్ పంచకుల రోడ్డు సమీపంలో ఉన్న లోకేశ్ లాటరీ షాపులో టికెట్ కొనిపించాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మహంత్ లాటరీ టికెట్ నంబర్ వచ్చింది.
వృద్ధుడికి రూ.5కోట్లు జాక్‌పాట్.. సంక్రాంతి లాటరీతో లైఫ్ టర్న్ - లోహ్రీ లాటరీ పంజాబ్ 2023
లాటరీ తగలడం వల్ల ఓ వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ విషయం తెలిసి అతడి ఇంటికి చాలా మంది క్యూ కడుతున్నారు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది.
ఈ విషయం తెలిసిన వెంటనే లాటరీ షాపు ఓనర్ లోకేశ్ కుమార్ బ్యాండు మేళంతో మహంత్ దాస్ ఇంటికి వచ్చాడు. అతడి కుటుంబ సభ్యులకు రూ. 5 కోట్ల లాటరీ తగిలింది అని చెప్పి పూల మాలల వేసి స్వీట్లు తినిపించాడు. ఈ వార్తతో ద్వారకా దాస్ ఇంట్లో కోలాహలం నెలకొంది. ఈ విషయం తెలిసి గ్రామస్థులంతా మహంత్ దాస్ ఇంటికి తరలివస్తున్నారు. జాక్‌పాట్ కొట్టిన దాస్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, పన్నులు అన్నీ పోగా మిగతా డబ్బు మహంత్‌కు వస్తుందని లాటరీ షాపు యజమాని లోకేశ్ కుమార్ తెలిపాడు.
రూ. 3.5 కోట్ల లాటరీ టికెట్లు.. గెలిచింది రూ. 5 వేలు
అనేక కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న సామాన్యులు.. ఒక్కసారిగా సంపన్నులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అదృష్టం తమను వరించకపోతుందా అనే ఆశతో అనేక మంది లాటరీ టికెట్ల కొంటుంటారు. కానీ అందరినీ అదృష్టం వరించదు. అందుకు ఉదాహరణే కేరళలోని కన్నౌర్‌కు చెందిన రాఘవన్. ఇతడు 52ఏళ్లుగా లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నాడు. రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున కొంటున్న రాఘవన్ ఇందుకోసం ఏకంగా 3కోట్ల50లక్షలు రూపాయలు ఖర్చు చేశాడు. ఇంతా చేసి ఇప్పటివరకు లాటరీల్లో రాఘవన్ గెలుచుకున్న గరిష్ఠ బహుమతి 5వేల రూపాయలు మాత్రమే. కాగా, మొట్టమొదటి లాటరీని 1970లో 18ఏళ్ల వయసులో కొనుగోలు చేసినట్లు చెప్పాడు రాఘవన్. కుటుంబ సభ్యుల నుంచి కూడా అతనికి సంపూర్ణ మద్ధతు లభిస్తోంది. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి