కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. సొంత పార్టీని స్థాపించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా.. పార్టీ పేరును 'పంజాబ్ లోక్ కాంగ్రెస్'గా ప్రకటించారు. పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమరీందర్ పార్టీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీ పేరును ప్రకటిస్తూనే.. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు కెప్టెన్. ఈ మేరకు 7 పేజీలతో కూడిన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
"కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈరోజు నా రాజీనామా లేఖను పంపించారు. నేను రాజీనామా చేయడానికి గల కారణాలు అందులో వెల్లడించారు. అదే సమయంలో కొత్త పార్టీ పేరు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్'గా నిర్ణయించాము. పార్టీ రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది. పార్టీ గుర్తును తర్వాత ప్రకటిస్తాం."