మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తమ రాష్ట్రాల్లో ఆలస్యం కావొచ్చని దిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు స్పష్టం చేశాయి. టీకాల కొరతే ప్రధాన కారణమని తెలిపాయి.
టీకాల కొరతే కారణం..
మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించటానికి.. తమ దగ్గర వ్యాక్సిన్లు లేవని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. 67లక్షల కోవిషీల్డ్ డోసులు ఆర్డర్ ఇచ్చామన్నారు. మే1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా పంపిణీ పంజాబ్లో ఆలస్యం అవనుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ. రాష్ట్రంలో సరిపడా కరోనా టీకాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీలోనూ టీకాల కొరత ఉందని మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.