Punjab Governor vs CM Supreme Court :అసెంబ్లీలో పాసైన బిల్లులను ఆమోదించకుండా పంజాబ్ గవర్నర్ అట్టిపెట్టుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గవర్నర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో, పంజాబ్లోని ఆప్ ప్రభుత్వ తీరును సైతం తప్పుబట్టింది. అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయడానికి బదులుగా, వాయిదా వేసి ఊరుకోవడానికి కారణమేంటని ప్రశ్నించింది. సంప్రదాయాలపై దేశం నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవసరం ఉందని పంజాబ్ ప్రభుత్వం, గవర్నర్కు స్పష్టం చేసింది.
'మేమే ఉత్తర్వులు జారీ చేస్తాం'
'పంజాబ్లో జరుగుతున్నదాని పట్ల మేం సంతోషంగా లేము. ఇది చాలా తీవ్రమైన అంశం' అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసెంబ్లీ పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. బిల్లులకు గవర్నర్ ఆమోదానికి సంబంధించిన చట్టంలోని వివాద పరిష్కారానికి తాము ఉత్తర్వులు జారీ చేస్తామని .
"ప్రజాస్వామ్యం కొనసాగడం ముఖ్యమంత్రి, గవర్నర్ చేతుల మీదగానే సాధ్యం. శాసనసభ నియమాలను ఎవరూ అతిక్రమించలేరు. పంజాబ్లో ప్రభుత్వం చేస్తున్న పని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. గవర్నర్ తీరు పట్ల కూడా మేం సంతృప్తిగా లేము. బిల్లులు పాస్ చేయకుండా సమావేశాలే రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ చెప్పడమంటే.. నిప్పుతో చెలగాటం ఆడినట్లే. పంజాబ్లో జరుగుతున్నది చాలా తీవ్రమైన అంశం."
-సుప్రీంకోర్టు
'గవర్నర్ ప్రజాప్రతినిధి కాదు'
ఇదే అంశంపై నవంబర్ 6న జరిగిన విచారణలోనూ.. గవర్నర్ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. తాము ప్రజాప్రతినిధులం కాదనే విషయాన్ని విస్మరించరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలు పంపిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ అసెంబ్లీ పంపిన బిల్లులపై గవర్నర్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.