పంజాబ్ రాజకీయాల్లో రోజుకో అనూహ్య పరిణామం(punjab news toda) చోటు చేసుకుంటోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్(amarinder singh news).. అమిత్‌షాతో భేటీ అయ్యారు. దిల్లీలోని షా నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. దీంతో కెప్టెన్ భాజపాలో చేరుతారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. నిజానికి అమరీందర్ సింగ్ మంగళవారమే షాను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ దిల్లీలో అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకే వెళ్లినట్లు ఆయన నిన్న పేర్కొన్నారు. ఇవాళ షాతో భేటీ అయ్యారు(amarinder singh news today).
అమిత్‌షాతో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భేటీ - అమరీందర్ సింగ్ వార్తలు
18:08 September 29
అమిత్‌షాతో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భేటీ
వ్యవసాయ చట్టాలపైనే చర్చ..
అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రితో తాను చర్చించేందుకే భేటీ అయినట్లు కెప్టెన్ అమరీందర్ వెల్లడించారు. సాగు చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై హామీ ఇవ్వడంతో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని అమిత్ షాను విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
పంజాబ్ కాంగ్రెస్‌లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరి ఆ పార్టీలో సంక్షోభం(punjab congress news) నెలకొంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ సీఎం పదవికి కొద్ది రోజుల క్రితం సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. సిద్ధూపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే పీసీసీ చీఫ్ పదవికి అనూహ్యంగా సిద్ధూ మంగళవారం రాజీనామా చేశారు. దీంతో అటు అమరీందర్, ఇటు సిద్ధూలు షాక్‌లు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సంక్షోభం మరింత ముదిరింది(punjab congress crisis). కెప్టెన్ భాజాపాలో చేరుతారనే ఉహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ ఆయన కమలం గూటికి చేరితే కాంగ్రెస్‌కు తప్పక నష్టం జరిగే అవకాశముంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ప్రభావం చూపగల నేత కావడమే ఇందుకు కారణం.