తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్​ కన్నుమూత - ప్రకాశ్ సింగ్ బాదల్​ కన్నుమూత

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దల్​ సీనియర్ నేత ప్రకాశ్​ సింగ్ బాదల్​ కన్నుమూశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందారు.

Prakash Singh badal had died
ప్రకాశ్ సింగ్ బాదల్​ కన్నుమూత

By

Published : Apr 25, 2023, 9:12 PM IST

Updated : Apr 25, 2023, 10:55 PM IST

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దల్​ సీనియర్ నేత ప్రకాశ్​ సింగ్ బాదల్​ కన్నుమూశారు. గత కొద్ది రోజలుగా అనాగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు రాత్రి 8 గంటల సమయంలో బాదల్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారం రోజుల క్రితం ప్రకాశ్​ బాదల్​ అనారోగ్యంతో మొహాలిలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఆసుపత్రిలో చేరారు.

బాదల్​ మృతిపై ప్రముఖుల సంతాపం..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బాదల్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత ఉన్నతమైన రాజకీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచారని ఆమె ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ సంతాపం వ్యక్తం చేశారు. బాదల్​ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధ కలిగించిందని మోదీ ట్వీట్​ చేశారు. భారత రాజకీయాల్లో బాదల్ కీలక పాత్ర పోషించారని.. దేశానికి ఎంతో సేవ చేశారని ప్రధాని తన ట్వీట్​లో పేర్కొన్నారు. బాదల్​ మరణం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టం చేకుర్చుందన్నారు. దశాబ్దాల పాటు బాదల్​తో సాన్నిహిత్యం ఉందన్న మోదీ.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్​షా కూడా ప్రకాశ్​ సింగ్ బాదల్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశ్​ సింగ్ బాదల్ భూమి పుత్రుడని రాజ్​నాథ్​ సింగ్​ అభివర్ణించాడు. ఆయన మృతిపై రక్షణ మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనేక సమస్యలపై ఆయనతో తాను జరిపిన సంభాషణలను.. ప్రేమగా గుర్తుంచుకుంటానని రాజ్​నాథ్​ తెలిపారు. బాదల్ మరణంపై పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ కూడా సంతాపం ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు.. జేపీ నడ్డా సైతం బాదల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ప్రకాశ్​ సింగ్ బాదల్​ మృతిపై.. రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది.

95 సంవత్సరాల వయస్సున్న ప్రకాశ్​ సింగ్ బాదల్​.. పంజాబ్​ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రకాశ్ సింగ్‌ బాదల్‌ 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1997 నుంచి ఆయన లాంబీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంజాబ్‌కు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగానూ బాదల్​ ఎన్నికయ్యారు. 1957 జరిగిన పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశ్​ సింగ్ బాదల్​ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1969లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969-1970 మధ్య కాలంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్, పంచాయితీ రాజ్, పశుసంవర్ధక, డెయిరీ మొదలైన మంత్రిత్వ శాఖలలో కార్యనిర్వాహక మంత్రిగా బాదల్​ పనిచేశారు.

1970-71, 1977-80, 1997-2002, 2007-2017లో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాదల్​ పనిచేశారు. 1972, 1980, 2002 సంవత్సరాలలో ఎన్నికైన అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. మొరార్జీ దేశాయ్ హయాంలో ఎంపీగా ప్రకాశ్ సింగ్​ బాదల్​ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగాను ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా వ్యవసాయం, నీటిపారుదల శాఖ బాధ్యతలను ప్రకాశ్ సింగ్ బాదల్‌ నిర్వర్తించారు. చివరగా ప్రకాశ్​ సింగ్ బాదల్..​ మార్చి 1, 2007 నుంచి 2017 వరకు పంజాబ్ రాష్ట్ర 30వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పంజాబ్‌లోని సిక్కు ఆధారిత రాజకీయ పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్​కు.. 1995 నుంచి 2008 ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. దాదాపు 17 ఏళ్ల పాటు ప్రకాశ్ సింగ్​ జైలు జీవితం సైతం అనుభవించారు.

బాదల్​ ఖాతాలో అనేక రికార్డులు..
ఎన్నికల చరిత్రలో బాదల్‌ అనేక రికార్డులను తన పేరిట నెలకోల్పారు. 1947 సంవత్సరంలో పంజాబ్‌లోని బాదల్‌ అనే గ్రామానికి ఈయన సర్పంచిగా గెలిచారు. అప్పట్లో అత్యంత చిన్న వయసులో సర్పంచి పదవి చేపట్టిన వ్యక్తిగా.. బాదల్​ రికార్డు సాధించారు. 1970లో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాదల్​ గెలిచారు. అప్పుడు ఆయన వయసు 43ఏళ్లు కాగా.. అప్పటివరకు అత్యంత పిన్క వయస్కులైన సీఎం బాదల్​ నిలిచారు. 2012లో మరోసారి పంజాబ్‌ ముఖ్యమంత్రిగా బాదల్​ బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు ఆయన వయస్సు 84 ఏళ్లు కాగా.. సీఎం పదవి చేపట్టిన అత్యంత పెద్ద వయస్కులుగా మరో రికార్డు దక్కించుకున్నారు.

Last Updated : Apr 25, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details