సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ చుట్టుపక్కల సాగుతున్న రైతు ఆందోళనల్లో మరో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డారు. సింఘూ సరిహద్దు వద్ద విష పదార్థం సేవించి అమరీందర్ సింగ్ (40) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన తోటి రైతులు ఆయనను హరియాణాలోని సోనిపట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
దిల్లీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య - సింఘూ సరిహద్దులో రైతు మృతి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సింఘూ సరిహద్దు వద్ద ఓ రైతు విషపదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.
దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి
ఈ రైతు పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్ జిల్లాకు చెందిన వారు అని పోలీసులు తెలిపారు. నెలన్నరకుపైగా సాగుతున్న దిల్లీలో రైతు ఆందోళనల్లో ఇప్పటికే పలువురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇదీ చూడండి:'సాగు చట్టాలు మేలే- మమ్మల్ని కక్షిదారులుగా చేర్చండి'