దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనేందుకు.. ఏకంగా 225 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు ఓ రైతు. పంజాబ్ జోగిపుర్ ప్రాంతానికి చెందిన కమల్జిత్ సింగ్ ఈ సాహసం చేశాడు.
"రైతుల నిరసనల కారణంగా అనేక చోట్ల రోడ్లు దిగ్బంధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర వాహనాలపై వెళ్తే అక్కడికి చేరుకోలేనని తెలుసు. అందుకే ఇలా సైకిల్ యాత్ర చేపట్టాను."
- కమల్జిత్ సింగ్, పంజాబ్ రైతు
సుదీర్ఘ ప్రయాణం కోసం సైకిల్‌పైనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు కమల్జిత్. సుమారు 16 గంటలపాటు సైకిల్ తొక్కి దిల్లీకి చేరుకున్నాడు.