Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. అధికార కాంగ్రెస్ ప్రభావం చూపలేక చతికిలపడిపోయింది.
పంజాబ్‌లో ఆప్ దూకుడు.. కాంగ్రెస్ బేజారు
Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.
పంజాబ్ ఫలితాల్లో ఆప్ దూకుడు
పంజాబ్ ఓట్ల లెక్కింపు- టాప్ 10 హైలైట్స్
- పంజాబ్ ఓట్ల లెక్కింపులో నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్
- ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
- ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ స్థానాలు దాటేసిన ఆప్
- ధురి స్థానంలో ఆధిక్యంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్
- ప్రభావం చూపలేకపోయిన అధికార కాంగ్రెస్
- ఆప్‌తో పోలిస్తే సుదూరంలో హస్తం పార్టీ
- సింగిల్ డిజిట్‌కే పరిమితమైన భాజపా
- బదౌర్ స్థానంలో ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ వెనుకంజ
- అమృత్సర్ తూర్పు స్థానంలో ఆధిక్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- పటియాలా స్థానంలో వెనుకంజలో కెప్టెన్ అమరీందర్ సింగ్