Punjab election new faces: పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్.. ఈ దఫా పలువురు యువ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. వారిలో- విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించినవారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మాజీ లెక్చరర్ తదితరులతో పాటు ప్రముఖ నాయకుల వారసులూ ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఈ కుర్రకారు ఎలాంటి ఫలితాలను రాబడుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పోటీలో ఉన్న కొందరు కీలక యువ అభ్యర్థుల సంక్షిప్త వివరాలివీ..
మాళవిక సూద్ సచ్చర్(38)
Malavika sood sachar: ఈమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రముఖ నటుడు, వితరణశీలి సోనూ సూద్ సోదరి. సిట్టింగ్ ఎమ్మెల్యే హర్‌జోత్ కమల్‌ను కాదనిమరీ మోగా సీటును కాంగ్రెస్ ఈమెకు కేటాయించింది.
Punjab assembly election 2022
సిద్ధూ మూసేవాలా (28)
పంజాబీ గాయకుడు. యువతలో ఆదరణ ఎక్కువ. మాన్సా నుంచి పోటీ చేస్తున్నారు.
రణ్‌వీర్‌కౌర్ మియాన్ (30)
ఆంగ్లంలో పీహెచ్‌డీ చేశారు. ఇటీవలి వరకు ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బుడ్‌లాడా నుంచి బరిలో దిగారు.