Manika Handa Punjab: ప్రభుత్వం తనకు సాయం చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని పంజాబ్‌కు చెందిన బధిర క్రీడాకారిణి మలికా హండ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెస్ క్రీడాకారిణి అయిన ఆమె.. క్రీడా శాఖ మాజీ మంత్రి తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారని చెప్పారు. ఇప్పుడున్న మంత్రి దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.
Deaf and dumb chess player
ఈ మేరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు మలిక. ప్రభుత్వం పట్టించుకోకపోవడం తనను కలచివేస్తోందని చెప్పారు.
"మాజీ క్రీడా మంత్రి నాకు నగదు రివార్డు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు కూడా. అయితే, అది కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత క్రీడా మంత్రి పర్గత్ సింగ్‌ను డిసెంబర్ 31న కలిశాను. మాజీ మంత్రి ఇచ్చిన హామీలను గుర్తు చేశాను. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదని పర్గత్ సింగ్ చెప్పారు. నగదు రివార్డు సైతం ఇవ్వదని అన్నారు. హామీ ఇచ్చింది గతంలో పనిచేసిన మంత్రి అని.. నాకేం సంబంధం అని పర్గత్ సింగ్ అంటున్నారు. బధిరుల క్రీడలకు సంబంధించి ప్రభుత్వం వద్ద విధానమేమీ లేదని మంత్రి చెబుతున్నారు. అలాంటప్పుడు అసలు ఉద్యోగం ఇస్తామని ఎందుకు ప్రకటించారు? కాంగ్రెస్ ప్రభుత్వం నా ఐదేళ్ల సమయాన్ని వృథా చేసింది. బధిరుల క్రీడలను పట్టించుకోవడం లేదు."
-మలికా హండ, బధిర క్రీడాకారిణి
అంతకుముందు, పంజాబ్ క్రీడా మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ను సైతం కలిశానని మలిక పేర్కొన్నారు. వారు సైతం ఎలాంటి సహాయం చేయడం లేదని వాపోయారు. తన భవిష్యత్ నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:భార్యా పిల్లల్ని చంపి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య.. అప్పుల వల్లే..