తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో జోరుగా 'పవర్​ పాలిటిక్స్​' - పంజాబ్ రాజకీయాలు

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్​పై మరోమారు విమర్శలతో విరుచుకుపడ్డారు నవ్​జ్యోత్ సింగ్ సిద్ధూ. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి(Punjab Power Cut) ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. విద్యుత్ సరఫరాలో దిల్లీ మోడల్​నే అమరీందర్ సింగ్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

Punjab Congress infighting continues; Sidhu again attacks CM's policies
Punjab Power Cut: పంజాబ్​లో జోరుగా 'పవర్​ పాలిటిక్స్​'

By

Published : Jul 2, 2021, 5:56 PM IST

పంజాబ్ కాంగ్రెస్​లో సంక్షోభం తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవ్​జ్యోత్ సింగ్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి(Punjab Power Cut) అమరీందర్ సర్కార్ విధానాలే కారణమని సిద్ధూ మరోమారు సొంత ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ట్విట్టర్​లో వరుస ట్వీట్లు చేశారు. దిల్లీ మోడల్​ను అనసరించకుండా పంజాబ్​కు సొంత మోడల్ రూపొందించాలని సూచించారు.

పంజాబ్​లో విద్యుత్ సంక్షోభం కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకే పని చేయాలని, ఏసీ వినియోగం తగ్గించాలని, విద్యుత్​ను అధికంగా ఉపయోగించే పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని సీఎం అమరీందర్​ సింగ్ అదేశించిన మరునాడే.. సిద్ధూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పలు సూచనలు చేశారు.

"విద్యుత్ ఖర్చు వాస్తవ లెక్కలు, కరెంటు కోతలు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పంజాబ్ ప్రజలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వచ్చు" అనే సారాంశంతో వరుస ట్వీట్లు చేశారు సిద్ధూ. అవేంటంటే..

అమరీందర్ ట్వీట్​
అమరీందర్ ట్వీట్​
  1. 'మనం సరైన దిశగా చర్యలు చేపడితే పంజాబ్​లో కరెంటు కోతలు, ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు, సామాన్యులు ఏసీ వాడకం నిలిపేయాల్సిన అవసరం లేదు.
  2. పంజాబ్ ప్రభుత్వం ఒక్కో యూనిట్​కు రూ.4.54 చెల్లిస్తోంది. జాతీయ సగటు ఒక్కో యూనిట్​కు రూ.3.85గా ఉంది. చండీగఢ్​ ఒక్కో యూనిట్​కు రూ.3.44 మాత్రమే వెచ్చిస్తోంది. మూడు ప్రైవేటు థర్మల్ ప్లాంట్లపైనే ఆధారపడటం వల్ల పంజాబ్ ప్రభుత్వం యూనిట్​కు రూ.5 నుంచి 8వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా అధికం.' అని సిద్దూ ట్వీట్ చేశారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి కూడా సిద్ధూ ప్రస్తావించారు. బాదల్ ప్రభుత్వం మూడు థర్మల్​ విద్యుత్ కేంద్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని తప్పుడు నిబంధనల కారణంగా 2020 నాటికే పంజాబ్ ప్రభుత్వం రూ.5,400 కోట్లు చెల్లించిందని సిద్ధూ అన్నారు. స్థిర విద్యుత్ ఛార్జీల కారణంగా ఇంకా రూ.65,000 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించాల్సి వస్తుందన్నారు.

" నేషనల్​ గ్రిడ్​ నుంచి పంజాబ్ ప్రభుత్వం చౌక ధరకే విద్యుత్​ను కొనుగోలు చేయవచ్చు. కానీ బాదల్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాపై సంస్థలతో మరోసారి చర్చలు జరిపే అవకాశం లేదు. ఒప్పందంలోని నిబంధనలు వాటికి న్యాయరమైన రక్షణ కల్పిస్తున్నాయి. కానీ మనకు మరో మార్గం ఉంది. అసెంబ్లీలో మరో కొత్త చట్టం తీసుకొచ్చి విద్యుత్ ధరలను నిర్ణయించాలి. చట్టాన్ని సవరిస్తే పాత ఒప్పందాలు చెల్లవు. ప్రజాధనం ఆదా అవుతుంది." అని సిద్దూ ట్వీట్ చేశారు.

పూర్తి విద్యుత్ కొనుగోలు, సరఫరా వ్యవస్థల నిర్వహణలో లోపాల కారణంగా పీఎస్‌పీసీఎల్.. రాష్ట్రం నుంచి సబ్సిడీగా రూ .9,000 కోట్లకు పైగా పొందిన తరువాత కూడా సరఫరా చేసిన ప్రతి యూనిట్‌కు రూ.0.18 అదనపు భారం పడుతోందని సిద్ధూ అన్నారు. పంజాబ్ ప్రభుత్వం రూ.9,000 కోట్ల విద్యుత్ సబ్సిసీ ఇస్తే.. దిల్లీ ప్రభుత్వం రూ.1,699 కోట్ల సబ్సిడీనే ఇస్తోందని వివరించారు. అందుకే దిల్లీ మోడల్​ను అనుసరించకుండా సొంత మోడల్​ను రూపొందించుకోవాలని సూచించారు.

రూ. 8.6లక్షల బిల్లు పెండింగ్​..

విద్యుత్ సంక్షోభంపై ప్రస్తుత, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన సిద్ధూ.. రూ.8,68,499 కరెంటు బిల్లు కట్టలేదని వార్తలు రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అమృత్​సర్​లోని తన నివాసానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను సిద్ధూ గత 9 నెలలుగా చెల్లించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

అకాలీదళ్ విమర్శలు..

కాంగ్రెస్ సీఎం కెప్టెన్​ అమరీందర్ సింగ్ ​ హయాంలో పంజాబ్ అభివృద్ధి క్షీణిస్తోందని శోరమణి అకాలీదళ్ నాయకురాలు హర్​సిమ్రత్ కౌర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 10నుంచి 12 గంటల వరకు కరెంటు కోతలున్నాయన్నారు. విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి: రాహుల్​తో నవ్​జ్యోత్​ సింగ్ సిద్ధూ భేటీ

సీఎం X సిద్ధూ: సంక్షోభంలోకి పంజాబ్‌ కాంగ్రెస్‌!

ABOUT THE AUTHOR

...view details