Bhagwant Mann Oath Ceremony: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్కలన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కేజ్రీవాల్‌కు ఆహ్వానం..
దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో భగవంత్ మాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత.. మాన్ కేజ్రీవాల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈనెల 13న అమృత్‌సర్‌లో జరిగే రోడ్‌షోలో కూడా కేజ్రీవాల్ పాల్గొననున్నారు.
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను ఆప్ దక్కించుకుంది. ధురీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్.. 58,206 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచారు.
ఇదీ చూడండి :'మోదీజీ.. భ్రమలు వద్దు.. అసలు యుద్ధం 2024లోనే'