Bhagwant Mann News: పంజాబ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవల దిల్లీకి వెళ్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేకుండానే ఈ భేటీ జరగడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. పంజాబ్‌లో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టాయి. భగవంత్ మాన్.. రబ్బర్ స్టాంప్ సీఎం అని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంపై గురువారం జలంధర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన మాన్.. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. పంజాబ్ అధికారులను తానే దిల్లీ సీఎం వద్దకు పంపినట్లు చెప్పారు. " శిక్షణ కోసం నేనే పంజాబ్ ఉన్నతాధికారులను కేజ్రీవాల్ వద్దకు పంపాను. గతంలోనూ వారు ట్రైనింగ్ కోసం గుజరాత్, తమిళనాడు వెళ్లారు. పంజాబ్ ప్రయోజనాల కోసం అధికారులను అవసరమైతే ఇజ్రాయెల్‌కు కూడా పంపుతాం. రానున్న రోజుల్లో కూడా వారిని బంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పంపుతాం. ఎక్కడ మంచి విషయం ఉన్నా తెలుసుకునుని పంజాబ్ ప్రజలకు కూడా దాన్ని ఉపయోగపడేలా చేస్తాం." అని మాన్ పేర్కొన్నారు.