Bhagwant Mann Admitted Hospital: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో బుధవారం చేరినట్లు.. అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపునొప్పితో బాధపడుతున్న సీఎంకు ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. జులై 7న మాన్ నిరాడంబరంగా.. రెండో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్ప్రీత్ కౌర్‌ను సీఎం మాన్ వివాహమాడారు. చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
కడుపునొప్పితో బాధపడుతున్న ఆ రాష్ట్ర సీఎం.. అపోలో ఆస్పత్రిలో చేరిక - పంజాబ్ సీఎం
Bhagwant Mann Admitted Hospital: కడుపునొప్పితో బాధపడుతున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి.
Punjab CM Bhagwant Mann admitted to hospital in Delhi
ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. మార్చి 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు. 117 స్థానాలున్న శాసనసభలో.. ఆప్ 92 చోట్ల గెలిచి సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. కాంగ్రెస్ 18 స్థానాలకే పరిమితమైంది.
Last Updated : Jul 21, 2022, 10:24 AM IST