తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో కలకలం.. ఆయుధాలు జారవిడిచిన డ్రోన్.. 3కిలోల హెరాయిన్​, చైనా తుపాకీ - పంజాబ్‌ ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో బీఎస్​ఎఫ్ దళాలు

పాకిస్థాన్​ వైపు నుంచి వచ్చి భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న డ్రోన్​ను బీఎస్ఎఫ్ దళాలు గుర్తించి కాల్పులు జరిపాయి. ఘటనాస్థలంలో ఆ డ్రోన్‌ జారవిడిచిన ఆయుధాలు, డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Arms and drugs in Ferozepur sector of Punjab news
పంజాబ్​లో ఆయుధాలు, డ్రగ్స్ కలకలం

By

Published : Feb 10, 2023, 11:02 AM IST

Updated : Feb 10, 2023, 1:44 PM IST

సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలను పంపుతున్న పాకిస్థాన్‌ ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకుంటూనే ఉన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో ఆయుధాలు, డ్రగ్స్‌తో పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న డ్రోన్‌ను బీఎస్​ఎఫ్​ దళాలు గుర్తించాయి. అప్రమతమైన భద్రతా సిబ్బంది డ్రోన్‌పై కాల్పులు జరిపారు.

ఆ డ్రోన్‌ జారవిడిచిన ఆయుధాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో మూడు కిలోల హెరాయిన్‌తోపాటు చైనాలో తయారైన తుపాకీ, బుల్లెట్లు, మ్యాగజైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వెనక్కి వెళ్లిపోయిన డ్రోన్‌ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లో రెండు రోజుల్లో రెండో ఘటన జరిగింది.

Last Updated : Feb 10, 2023, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details