Punjab Assembly Elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి.
అంతకు ముందు ఎన్నికలను వాయిదా వేయాలంటూ.. సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఈసీను కోరారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్ చంద్రకు లేఖ రాశారు.
"గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు నన్ను కోరారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్నారు." అని లేఖలో ప్రస్తావించారు చన్నీ.
Guru Ravidas Jayanti 2022: అలాగే, ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు యూపీలోని బెనారస్‌లో జరగనున్న గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమ రాష్ట్రం నుంచి దాదాపు 20లక్షల మంది వెళ్లే అవకాశం ఉన్నట్టు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే లక్షల మంది తమ రాజ్యాంగపరమైన హక్కుగా ఉన్న ఓటు హక్కును వినియోగించుకోలేరని తెలిపారు.
అందువల్ల పోలింగ్ తేదీని పొడిగించినట్లయితే బెనారస్ వెళ్లి రావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోగలుగతామని వారు కోరిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఈ అసెంబ్లీ వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా కనీసం ఆరు రోజులైనా ఎన్నికలను వాయిదా వేయాలని చన్నీ సీఈసీని కోరారు.
ఇదీ చూడండి:బంగాల్‌కు కేంద్రం షాక్- మమత తీవ్ర అభ్యంతరం