తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాంతాబాయి మళ్లీ కర్రసాము- కారణమదే! - సోనూసూద్ సాయం పొందిన శాంతాబాయి

85 ఏళ్ల వయసులో కర్రసాము చేస్తూ నెట్టింట వైరల్​ అయిన పుణె బామ్మ శాంతాబాయి మళ్లీ వీధుల్లో ప్రదర్శనలు ప్రారంభించారు. గతేడాది సోనూసూద్ సహా చాలా మంది ప్రముఖలు ఆమెకు సాయం చేశారు. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం వల్ల ప్రస్తుతం జీవనోపాధికోసం కర్రసాము ప్రదర్శనలు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు.

Pune famous Warrior Ajji
శాంతాబాయి, కర్రసాము బామ్మ

By

Published : May 7, 2021, 11:46 AM IST

కర్రసాముతో అందరినీ అలరించిన.. మహారాష్ట్ర-పుణెకు చెందిన 85 ఏళ్ల బామ్మ శాంతాబాయి పవార్ మళ్లీ వీధుల్లో తన ప్రదర్శనలు ఇస్తున్నారు. జీవనోపాధి కోసమే మళ్లీ ప్రదర్శనలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

మాట్లాడుతున్న శాంతాబాయి

ఎందరో సాయం చేసినప్పటికీ..

గతేడాది 'లాఠీకాఠీ(కర్రసాము)' చేస్తూ శాంతాబాయి పలువురి మన్ననలు పొందారు. 85 ఏళ్ల వయసులో వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్న ఆమె వీడియోలు వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో ఆమెకు.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్, నటుడు రితేష్ దేశ్​ముఖ్, సోనూసూద్, నేహా కక్కర్ వంటి ప్రముఖులు చేయూతనిచ్చారు. ఆర్థిక సాయం చేశారు.

జీవనోపాధికి..
కర్రసాము చేస్తూ

కానీ.. ప్రస్తుతం శాంతాబాయి చేతిలో డబ్బులు లేక జీవనోపాధి కోసం మళ్లీ కర్రసాము చేస్తు హదస్పుర ప్రాంతంలో కనిపించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

వీధుల్లో కర్రసాము చేస్తున్న 85 ఏళ్ల బామ్మ

ఇదీ చదవండి:అబ్బాయి మెడలో తాళి.. విచిత్రంగా ఉంది కదూ!

ABOUT THE AUTHOR

...view details