తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పునీత్ మరణంతో ప్రజల్లో ఆ భయం- టెస్టుల కోసం క్యూ - బెంగళూరు జయదేవ ఆస్పత్రి

కన్నడ నటుడు పునీత్ రాజ్​కుమార్ మరణం తర్వాత ఆస్పత్రుల్లో రద్దీ అధికమైంది. సొంత ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. చెకప్​ల కోసం తరలి వెళ్తున్నారు ప్రజలు. గుండె చెకప్​లు, ఈసీజీలు చేయించుకుంటున్నారు.

Puneeth Death Effect: People are flocking to Hospital for cardiac checkups
పునీత్ మరణం.. సొంత ఆరోగ్యంపై భయంతో ఆస్పత్రులకు ప్రజలు

By

Published : Nov 2, 2021, 2:23 PM IST

Updated : Nov 2, 2021, 3:44 PM IST

కన్నడ అగ్రనటుడు పునీత్ రాజ్​కుమార్ హఠాన్మరణం (Puneeth Rajkumar Death).. ప్రజల్లో ఆరోగ్యంపై భయాలను పెంచేసింది. శారీరకంగా దృఢంగా ఉండే పునీత్.. గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో తమ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల (Heart Check up Tests) కోసం ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు.

ఆస్పత్రిలో రోగుల రద్దీ

బెంగళూరులోని జయదేవ ఆస్పత్రికి (Jayadeva Hospital Bangalore) ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల... బయట భారీగా క్యూ ఏర్పడింది. సాధారణంగా 1,200 మంది రోగులు వచ్చే ఈ ఆస్పత్రికి సోమవారం 1,600 మంది వచ్చారని వైద్యులు చెబుతున్నారు. పునీత్ మరణం తర్వాత ఓపీడీ రోగుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారితో పాటు రోజూ జిమ్​కు వెళ్లేవారు, ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఆస్పత్రికి వస్తున్నట్లు వెల్లడించారు.

ఆస్పత్రుల్లో చెకప్ కోసం ఎదురుచూస్తున్న రోగులు
క్యూలో నిలబడ్డ ప్రజలు

మైసూరులోని జయదేవ ఆస్పత్రికి సైతం రోగుల తాకిడి పెరిగిందని ఈ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎన్ మంజునాథ్ తెలిపారు. సాధారణం కంటే 25 శాతం అధికంగా రోగులు వస్తున్నారని వెల్లడించారు. ఈసీజీ వంటి పరీక్షలు ఎక్కువగా చేయించుకుంటున్నారని చెప్పారు.

జిమ్ చేస్తూ...

అక్టోబర్ 29న పునీత్ రాజ్​కుమార్ కన్నుమూశారు. జిమ్​లో కసరత్తులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడం వల్ల, ఆయన సిబ్బంది వెంటనే దగ్గర్లోని రమణశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.

ఇదీ చదవండి:

Last Updated : Nov 2, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details