తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డుపై ట్యాంకర్​ బీభత్సం- ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు - ఘోర రోడ్డు ప్రమాదం

ఆటోను (7 సీటర్​) ట్యాంకర్​ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

accident news
ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Oct 23, 2021, 12:51 AM IST

మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. కాత్రజ్-ముంబయి రోడ్​లో నవలే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.

"పెయింట్​ పరిశ్రమలో వాడే తిన్నర్​తో ముంబయి వైపు వెళ్తున్న ఓ ట్యాంకర్​ శుక్రవారం సాయంత్రం.. ఓవర్​టేక్​ చేసే క్రమంలో ఆటోను (7 సీటర్) ఢీకొట్టింది​. వెంటనే ఆటో​ బోల్తా కొట్టి రోడ్డు మీద నుంచి పక్కకు దొర్లుకుంటూ వెళ్లింది. అనంతరం మరో ఖాళీ కంటెయినర్​ కూడా ట్యాంకర్​ ఢీకొట్టింది." అని పోలీసులు తెలిపారు.

మరణించినవారిలో ఇద్దరు ఆటోలో ఉండగా, మరొకరు పాదచారి అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details