మహారాష్ట్రలోని పుణె మార్కెట్లో ఈ సీజన్లో తొలిసారి వచ్చిన మామిడి పండ్లు రికార్డ్ ధర పలికాయి. ఓ యజమాని తన దుకాణానికి వచ్చిన మామిడ పండ్ల పెట్టెను వేలం వేయగా.. రూ.31,000 అమ్ముడుపోయింది. మార్కెట్ యాభై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక ధరగా స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
మామిడిపళ్ల పెట్టెతో వ్యాపారులు వేలంపాట ఎందుకు?
పుణె వ్యాపారులు తమ దుకాణాలకు సీజన్లో వచ్చిన మొదటి మామిడి పండ్ల పెట్టెకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సీజన్ మొత్తం వ్యాపారం బాగా జరగాలని దేవుడిని ప్రార్థిస్తారు. మామిడిపండ్ల పెట్టెకు పూలదండ వేసి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత వేలం పాట నిర్వహిస్తారు. ఆ వేలం బట్టే తమ వ్యాపారం ఆధారపడి ఉంటుందని పుణె వ్యాపారులు నమ్ముతారు.
పూజ చేస్తున్న యజమాని యువరాజ్ దేవ్ఘడ్ రత్నగిరి నుంచి మొదటి మామిడి పండ్ల పెట్టె... శుక్రవారం పుణె ఏపీఎంసీ మార్కెట్ వ్యాపారి యువరాజ్ కచి దుకాణానికి వచ్చింది. యజమాని యువరాజ్ ఆ పెట్టెపై వేలంపాట నిర్వహించారు. ఐదువేల దగ్గర మొదలైన వేలం రూ.31,000కు చేరుకుంది.
"నా దుకాణానికి ఈ సీజనల్లో మొదటి మామిడిపండ్ల పెట్టె వచ్చింది. ఏటా నిర్వహించే వేలం లాగే ఈ ఏడాది నిర్వహించా. ఎన్నడూలేనంతగా రూ.31,000కు పెట్టె అమ్ముడుపోయింది. కరోనా మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాలు లాభాలు లేక నష్టపోయా. అయితే ఇప్పుడు పరిస్ధితులు కాస్త మెరుగుపడ్డాయి అందుకే మామిడిపండ్లు ఎక్కువ రేటు ఉన్నా.. తెచ్చి అమ్ముతున్నాను."
-యువరాజ్, వ్యాపారి
ఇదీ చదవండి: జూ పార్కులో రెండు అరుదైన కోతులు అపహరణ.. కంచె కట్ చేసి..