Pune Boy Suicide: మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన జరిగింది. ఆడుకునే బొమ్మకు ఉరివేసిన ఎనిమిదేళ్ల బాలుడు అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన నోట్లో బట్టను కుక్కుకొని ఊపిరాడక చనిపోయాడు. పింప్రీ చించ్వడ్లోని తేర్గావ్లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది:బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు దానికి ఉరివేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అది చనిపోయినట్లు భావించి.. తాను కూడా తన నోరు, ముఖంపై బట్ట పరుచుకొని ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కూడా కంగుతిన్నారు.