మహారాష్ట్ర పుణె తలెగావ్ దభాడేకు చెందిన 12 ఏళ్ల బుడతడు సోహమ్ సాగర్ పండిత్ తన ప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్పేస్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన.. స్పేస్ రీసెర్చ్ ఛాలెంజ్ 2021లో పాల్గొని.. అత్యంత తేలికైన శాటిలైట్ తయారు చేసి చరిత్ర సృష్టించాడు.
తేలికైన శాటిలైట్...
100 తేలికైన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి 25-80 గ్రాముల బరువుతో ప్రపంచంలోనే అత్యంత తేలికైన శాటిలైట్లు కావడం గమనార్హం. హీలియం బెలూన్ల సాయంతో 35-38 వేల మీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను లాంఛ్ చేశారు.
తరగతిలో పాఠాలు వింటున్న సోహమ్ గాలిలోని తేమ, కాలుష్యం, వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు ఈ శాటిలైట్లు ఉపయోగపడతాయి.
అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోహమ్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్, అసిస్టంట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
మరో చిచ్చరపిడుగు...
హులా-హూపింగ్ ఆట తెలుసా? అదేనండీ ఒక రింగును నడుము చుట్టూ ఆపకుండా, కింద పడకుండా తిప్పుతుంటారు. చూడటానికి సులువుగానే అనిపించినా.. రింగు కిందపడకుండా తిప్పడం చాలా కష్టం. అలాంటిది 9ఏళ్ల బాలుడు రింగును కిందపడకుండా తిప్పడమే కాదు, దాన్ని తిప్పుకుంటూ 50 మెట్లు ఎక్కి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు.
తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన ఆదవ్ సుగుమార్ ఈ ఘనత సాధించాడు. కుమరన్ కుంద్రం దేవాలయంలో 50 మెట్లను రింగు తిప్పుతూ 18.28 సెకన్లలో ఎక్కేశాడు. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన ఆశ్రిట ఫ్యూరమన్ అనే వ్యక్తి పేరుతో ఉంది. 2018లో అతడు 23.39 సెకన్లలో 50 మెట్లు ఎక్కి రికార్డు సృష్టించాడు. ఫ్యూర్‌మన్ రికార్డును ఇటీవల సుగుమార్ బద్దలుకొట్టాడు. ఈ రికార్డు సాధించడానికి రెండు నెలలు సాధన చేశాడట. పరిగెడుతూ హులా హూపింగ్ చేస్తూ రికార్డు కొట్టడమే తన తదుపరి లక్ష్యమని తెలిపాడు.
ఇదీ చదవండి: