తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాడార్లకు చిక్కని యుద్ధనౌకలు! - రక్షణ మంత్రిత్వ శాఖ

భారత్​లో.. భవిష్యత్తు తరం యుద్ధనౌకల రూపకల్పన కోసం పుణెకు చెందిన అంకుర సంస్థ ఎంపికైంది. రాడార్లకు చిక్కని విధంగా రూపొందించే ఈ యుద్ధనౌకల కోసం జూస్​ న్యూమరిక్స్​ సంస్థకు, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ రూ.1.5 కోట్లు మంజూరు చేసింది.

Zeus Numerix has been selected to design the new warships
రాడార్లకు చిక్కని యుద్ధనౌకల రూపకల్పన

By

Published : Apr 3, 2021, 7:16 AM IST

Updated : Apr 3, 2021, 9:46 AM IST

రాడార్​ కళ్లకు కనిపించని భవిష్యత్​ తరం యుద్ధనౌకల రూపకల్పన కోసం పుణెకు చెందిన అంకుర సంస్థ జూస్​ న్యూమరిక్స్​ ఎంపికైంది. ఈ దిశగా గోవా షిప్​యార్డ్​తో భాగస్వామ్యం వహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. జూస్​ సంస్థ.. కంప్యూటర్​ సిమ్యులేషన్ల రంగంలో పనిచేస్తోంది. అత్యంత నైపుణ్యంతో రూపొందించిన సిమ్యులేషన్​ నమూనాల ద్వారా.. బాంబులు, క్షిపణుల మార్గాన్ని 95 శాతం కచ్చితత్వంతో ముందుగానే గుర్తించొచ్చు. దీనికి తోడు ఈ తరహా సిమ్యులేషన్ల ద్వారా ఆయుధ రూపకల్పనలో భారీగా సొమ్ము ఆదా అవుతుంది.

42 మందితో..

జూస్​ న్యూమరిక్స్​ను బొంబాయి ఐఐటీ పూర్వ విద్యార్థులు బసంత్​ గుప్త, ఇర్షాద్​ ఖాన్​, అభిషేక్​ జైన్​లు 2004లో ప్రారంభించారు. ఈ సంస్థలో 42 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అయినా రక్షణ విభాగానికి చెందిన 50 సంస్థలు ఈ అంకుర పరిశ్రమ నుంచి సేవలు పొందుతున్నాయి. ఇప్పటికే 225 రక్షణ ప్రాజెక్టులను ఈ సంస్థ పూర్తి చేసింది. 2010లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్​-30ఎంకేఐ యుద్ధ విమానానికి బ్రహ్మోస్​ క్షిపణిని అనుసంధానించే కీలక ప్రాజెక్టుపై ఈ సంస్థ పనిచేసింది. ఈ ప్రాజెక్టు కోసం రష్యా తొలుత రూ.1300 కోట్లు డిమాండ్​ చేసింది. అయితే.. జూస్​ సంస్థ దాన్ని రూ.80 కోట్లకే పరిమితం చేయడం విశేషం.

ఇదీ చదవండి:ఇస్రో-నాసా కొత్త రాడార్​తో ఇక పక్కా లెక్కలు

Last Updated : Apr 3, 2021, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details