తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ మాస్క్ పెట్టుకుంటే కరోనా ఖతం! - పుణె త్రీడీ కరోనా మాస్కులు

కరోనా వైరస్​ను అచేతనం చేసే మాస్కును ఓ స్టార్టప్ తయారు చేసింది. త్రీడీ ప్రింటింగ్ సాయంతో దీన్ని రూపొందించింది. ఈ మాస్కును వైరస్​ తాకగానే క్రియారహితంగా మారిపోతుందని కేంద్రంలోని డిపార్ట్​మెంట్ ఆఫ్ సైన్స్ తెలిపింది.

virus special mask
ఈ మాస్కు పెట్టుకుంటే కరోనా దరిచేరదు!

By

Published : Jun 14, 2021, 7:37 PM IST

కరోనా వైరస్‌ను అచేతనంగా మార్చేసే మాస్కును పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ రూపొందించింది. త్రీడీ ప్రింటింగ్‌ను ఫార్మాస్యూటికల్స్‌తో ఏకీకృతం చేసి.... ఈ మాస్క్‌ను థిన్‌క్రో టెక్నాలజీస్‌ అభివృద్ధి చేసింది.

మాస్కును వైరస్‌ తాకగానే అచేతనంగా మారిపోతుందని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్‌ తెలిపింది. ఈ మాస్క్‌కు యాంటీవైరల్‌ ఏజెంట్స్ లేదా వైరుసైడ్స్‌ అనే కోటింగ్‌ను వేయడం వల్ల కొవిడ్‌ను క్రియారహితం చేస్తుందని వివరించింది. సోడియం ఓలెఫిన్ సల్ఫోనేట్‌ ఆధారిత మిశ్రమంతో...ఈ మాస్క్‌ రూపొందించినట్లు తెలిపింది.

వైరస్ బాహ్యపొరను ఈ మాస్క్‌పై ఉన్న కోటింగ్‌ దెబ్బతీస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్‌ వెల్లడించింది. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక అభివృద్ధి బోర్డు(టీడీబీ) ఈ మాస్కులను ఎంపిక చేసినట్లు పేర్కొంది.

మరోవైపు, ఈ మాస్క్‌ పేటెంట్‌ హక్కుల కోసం థిన్‌క్రో టెక్నాలజీస్‌ దరఖాస్తు చేసుకుంది. వాణిజ్య స్థాయి ఉత్పత్తి కూడా మొదలు పెట్టినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్​- ఓన్లీ ఫన్​!

ABOUT THE AUTHOR

...view details