తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహనంపై సీఆర్​పీఎఫ్ కాల్పులు- మహిళకు గాయాలు

జమ్ము కశ్మీర్​లో ఓ ప్యాసెంజర్ వాహనంపై సీఆర్​పీఎఫ్ జవాన్లు కాల్పులు చేశారు. రెండు చెక్ పాయింట్ల వద్ద ఆపకపోవడం వల్ల.. బలగాలు ఈ కాల్పులు జరిపాయి. దీని వల్ల ఓ మహిళకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

crpf fired at vehicle
వాహనంపై సీఆర్​పీఎఫ్ కాల్పులు- మహిళకు గాయాలు

By

Published : Apr 17, 2021, 7:37 PM IST

జమ్ము కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో చెక్​ పాయింట్ల వద్ద ఆపలేదని ఓ వాహనంపై సీఆర్​పీఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. వాహన డ్రైవర్​ జునైద్ తారిఖ్ దార్​ను పోలీసులు అరెస్టు చేశారు.

సాయంత్రం 3.15 గంటలకు అవంతిపొరా చౌక్ వద్ద ఓ ప్యాసింజర్ వాహనాన్ని ఆపాల్సిందిగా పోలీసులు కోరారు. కానీ డ్రైవర్ వేగంగా వెళ్తూ.. నాసర్ ఉల్లా అనే ఓ పోలీసు అధికారిని ఢీకొట్టాడు. అనంతరం పద్గాంపొరా వంతెన వద్ద సీఆర్​పీఎఫ్ అధికారులు వాహానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. డ్రైవర్ ఆగలేదు. దీంతో గాల్లోకి హెచ్చరికగా కాల్పులు జరిపారు.

కాల్పుల వల్ల వాహనం టైర్లు పగిలిపోయిందని పోలీసులు తెలిపారు. వాహనంలో ఉన్న జైసీ పర్వేజ్ షేక్ అనే మహిళ కుడి భుజానికి బులెట్ గాయాలయ్యాయని చెప్పారు. డ్రైవర్​ను అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.

గాయపడ్డ మహిళను స్థానిక పోలీసులు.. అవంతిపురలోని ఆస్పత్రికి తరలించారని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను మరో ఆస్పత్రికి పంపించినట్లు వివరించారు. ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. ఘటనలో గాయపడ్డ పోలీసు ఆరోగ్య పరిస్థితి సైతం నిలకడగానే ఉందని తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:బెయిల్ మంజూరైన కొన్ని గంటలకే దీప్​ సిద్ధూ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details