పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ నేతల్లో ఒకరు డీఎంకే జెండా ప్రదర్శించడం వల్ల ఇతర నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.
పార్టీ నేత నుంచి డీఎంకే జెండాను లాక్కున్న ఇతర సభ్యులు.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాజీ సీఎం నారాయణస్వామి అక్కడ ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది.